ధైర్యముంటే బీజేపీలో చేరాలి.. రెబెల్​ నేతలకు దీదీ సవాల్​

కలం, వెబ్​ డెస్క్​ : బీజేపీ తమ పార్టీని చీల్చేందుకు కుట్రలు చేస్తోందని బెంగాల్​ మాజీ సీఎం, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. తృణముల్​ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. బీజేపీ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారు.

తమ పార్టీలో చోటు చేసుకుంటున్న మార్పులకు బీజేపీనే అని విమర్శించారు. పార్టీలోని నాయకులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని మమత ధ్వజమెత్తారు. నిజాయితీలేని కొందరు కాషాయ పార్టీకి అమ్ముడు పోయారని.. ధైర్యముంటే నేరుగా బీజేపీలో చేరి మాట్లాడాలని ఆమె సవాల్​ విసిరారు.

కాగా, టీఎంసీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నారు.అధికారం కోల్పోయిన వెంటన ఆ పార్టీ నేతలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కీలక నేతలు టీఎంసీని వీడుతున్నట్లు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న టీఎంసీ బెంగాల్​ అధ్యక్షురాలు చంద్రిమా పదవికి రాజీనామా చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>