15 ఏళ్ల నిరీక్షణకు ‘జాక్​పాట్​’.. రైతుకు రూ.12 కోట్ల లాటరీ!

కలం, వెబ్​ డెస్క్​: అదృష్టం ఎప్పుడు.. ఎవరిని వరిస్తుందో చెప్పలేం. లక్కు బాగుంటే తక్కువ సమయంలో కోటీశ్వరులు కావొచ్చు. కొందరు ఏళ్ల తరబడి వేచి చూసిన తరువాత అదృష్టం తలుపుతట్టే అవకాశం ఉంటుంది. అలాంటి, సంఘటనే పంజాబ్ (Punjab)​ లో జరిగింది. కేవలం రూ.500 పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఓ రైతు జీవితాన్ని మార్చేసింది.

పంజాబ్‌లోని దేరాబస్సీ సమీపంలోని హుమాయున్‌పూర్ గ్రామానికి చెందిన బల్జిందర్ సింగ్ (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా లాటరీ తగల్లేదు. ఈసారి దీపావళికి ముందు హందేస్రాలోని ఓ లాటరీ విక్రేత వద్ద రూ.500 చెల్లించి బల్జిందర్ సింగ్ టికెట్ కొనుగోలు చేశారు. అదృష్టం వరించడంతో రూ.12 కోట్ల లాటరీ జాక్ పాట్ తగిలింది. దీంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>