కవలల జననం తర్వాత ఎన్నో కష్టాలు.. ఉపాసన భావోద్వేగ సందేశం!

కలం, వెబ్​ డెస్క్ : మెగా కోడలు, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల (Upasana Konidela) తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో “అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్‌” ను ఉపాసన కొణిదెల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భం దాల్చేందుకు ప్రయత్నించే మహిళలు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, ప్రసవం తర్వాత తల్లులు అనుభవించే ఇబ్బందులపై (Postpartum Struggles) ఆమె మాట్లాడారు.

ముఖ్యంగా రెండోసారి కవలలకు (Twins) జన్మనిచ్చిన తర్వాత తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక సమస్యలను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలిసారి గర్భం దాల్చిన సమయంలో తనకు పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఉపాసన తెలిపారు. అయితే రెండోసారి కవలలకు జన్మనిచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని వెల్లడించారు. ప్రసవం అనంతరం శరీరంలో చోటుచేసుకున్న మార్పులతో పాటు మానసికంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించారు. ఆ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నానని, కోలుకునే ప్రయాణం అంత సులభంగా సాగలేదని భావోద్వేగంగా చెప్పారు.

తల్లిగా మారే క్రమంలో మహిళలు పడే బాధలు, ఒత్తిడిని సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రసవం తర్వాత తల్లుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, సమాజం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాసన విజ్ఞప్తి చేశారు. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా వారి మానసిక స్థితిని కూడా అర్థం చేసుకుని అండగా నిలవాలని సూచించారు. ప్రసవానంతరంబిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలలో తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>