కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసి, గ్రామీణ ప్రాంత రైతులకు మెరుగైన సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 240 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (Telangana PACS) ఏర్పాటుతో పాటు, ఇప్పటికే ఉన్న సంఘాల పునర్వ్యవస్థీకరణకు తదుపరి చర్యలు చేపట్టేందుకు వ్యవసాయ, సహకార శాఖ అనుమతి మంజూరు చేసింది.
ఈ మేరకు నవంబర్ 11, 2026న ప్రభుత్వం అధికారిక మెమో జారీ చేసింది. నిబంధనల ప్రకారం అవసరమైన క్షేత్రస్థాయి ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి, తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో రైతులకు ఎరువులు, విత్తనాలు, పంట రుణాల పంపిణీ మరింత సులభతరం కానుంది.

