కలం, వరంగల్ : ‘కుడా’ భూ వేలం వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న సవాళ్లు–ప్రతి సవాళ్లు వరంగల్ భద్రకాళి ఆలయం (Bhadrakali Temple) వేదికగా రాజకీయ వేడిని రాజేశాయి. ఈ నేపథ్యంలో పవిత్ర ఆలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చి “మైల పరిచారని” ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు శనివారం ఆలయ శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
అయితే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి బీజేపీ నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలు భద్రకాళి ఆలయానికి (Bhadrakali Temple) చేరుకుని శుద్ధి కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించగా, పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని శుద్ధికి మట్టేవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆలయ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
Read Also: మోదీని చంపేస్తాం.. ఆ దేశం నుంచి బెదిరింపులు!
Follow Us On: Instagram

