Mobile Popup Ad
Mobile Popup Ad

మోదీని చంపేస్తాం.. ఆ దేశం నుంచి బెదిరింపులు!

క‌లం, వెబ్ డెస్క్‌: భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi)కి హ‌త్యా బెదిరింపులు రావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఆస్ట్రేలియా (Australia)కు మోదీ వ‌స్తే చంపేస్తామంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని పోస్టులు వైర‌ల్ అయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా ఫెడ‌ర‌ల్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ పోస్టుల‌కు సంబంధించిన ఐపీ ఆడ్ర‌స్‌ల‌ను గుర్తించి కేసులు న‌మోదు చేశారు. ఈ పోస్టులు ఎవ‌రు పెట్టార‌న్నది గుర్తించేందుకు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఈ నెల 9న మోదీ ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. మెల్‌బోర్న్ మీట్స్ ది మోదీ పేరుతో ఓ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆగంతకులు సోష‌ల్ మీడియాలో బెదిరింపుల‌కు దిగారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. మోదీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>