Mobile Popup Ad
Mobile Popup Ad

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడిన ప్రభుత్వం : సీతక్క

కలం, నిజామాబాద్ బ్యూరో : గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్, తిర్మన్ పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శనివారం మంత్రి.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. రాంపూర్ తండా నుండి వెంగల్ పాడ్ తండా వరకు రూ.5.48 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, అలాగే కేకే తండా నుండి మెగ్యానాయక్ తండా వరకు రూ. 2.94 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

అనంతరం తిర్మన్ పల్లిలో (Thirmanpally) గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అదనపు సదుపాయాల కల్పనలో భాగంగా నూతనంగా నిర్మించిన వసతి గృహ భవన సముదాయం, కిచెన్ డైనింగ్ హాల్ లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క (Seethakka) మాట్లాడుతూ, మారుమూల గిరిజన తండాలు, గ్రామాలలో అభివృద్ధి పనులలో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. కళాశాల విద్యార్థినులతో కలిసి సంప్రదాయ గిరిజన నృత్యంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ భుజంగ రావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తిర్మన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: అడ్లూరి vs కొప్పుల.. ధర్మపురిలో వేడెక్కిన రాజకీయం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>