కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీకులు ఇవ్వడంపై మాజీ మంత్రి జగదీష్ (Jagadish Reddy) రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి కేవలం గత ప్రభుత్వంపై ఏడవడమే పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. ప్రతి విషయంలోనూ విమర్శలు చేయడం తప్ప, రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు.
గతంలో విద్యుత్ రంగంపై రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారని, అయితే ఆ రంగంపై వచ్చిన నివేదిక చూశాక ఆయనకు నోరు పడిపోయిందని జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఎద్దేవా చేశారు. విద్యుత్ నివేదిక రాగానే దానిని మడిచి ఎవరికీ కనబడని చోట పెట్టుకున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్(KCR) పాలనలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే అద్భుతంగా, 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చారని నివేదికలో తేలిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ మల్లెపూవు లాంటి స్వచ్ఛమైన నాయకుడని ఆ నివేదికలే స్పష్టం చేస్తున్నాయని జగదీష్ రెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram) విషయంలోనూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం ఇలాగే బురదజల్లే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరంపై ఏడవడం ఆపి, ముందు ఆ ప్రాజెక్టుకు రిపేర్లు చేయాలని కోర్టు సైతం ప్రభుత్వానికి సూచించిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం విచారణల పేరుతో కాలయాపన చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని జగదీష్ రెడ్డి హితవు పలికారు.
Read Also: బీఆర్ఎస్ గుబులంతా ‘సౌత్’పైనే..!
Follow Us On: X(Twitter)


