కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. అలా చేస్తే వారి తాట తీస్తానంటూ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. మంగళవారం హరీశ్ రావు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ఫోన్ ట్యాపింగ్, అవినీతి కేసులను తెరమీదకు తీసుకొస్తోందని వ్యాఖ్యానించారు.
‘అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో నాకు నోటీసులు ఇస్తారంటూ లీకులు ఇస్తున్నారు. రేవంత్(Revanth Reddy) మెప్పు కోసం అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అటువంటి అధికారుల పేర్లు రాసుకుంటున్నాం. మేం అధికారంలోకి రాగానే వారి సంగతి తేలుస్తాం. గతంలో ఏపీలో అధికారులకు పట్టిన గతే తెలంగాణలోని అధికారులకు కూడా పడుతుంది’ అంటూ ఆయన హెచ్చరించారు.
‘ఈ సిట్ ఒక పెద్ద జోక్. రేవంత్ మెప్పు కోసం పోలీసు అధికారుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా గుంజుకొస్తాం. ఉద్యమంలో నాపై 300 కేసులు ఉన్నాయి. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడం. డీజీపీ శివధర్ రెడ్డికి ఫుట్‌బాల్ మ్యాచ్ రక్షణకే సమయం సరిపోతోంది.’ అంటూ హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు.
Follow Us On: X(Twitter)


