కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ (Bangladesh High Commission) వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, ముఖ్యంగా మైమెన్‌సింగ్ జిల్లాలో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ (Dipu Chandra Das)హత్య ఘటనపై ఆగ్రహంతో విశ్వ హిందూ పరిషత్ (VHP), భజరంగ్ దళ్ తదితర హిందూ సంఘాలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ (Bangladesh High Commission) ప్రధాన ద్వారం వద్ద ఆందోళనలో భాగంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. దీపు చంద్ర దాస్ కుటుంబానికి న్యాయం చేయాలని, హిందూ ఆలయాలపై దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు బారికేడ్లను ఛేదించి, హైకమిషన్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లోని మరికొన్ని నగరాల్లో కూడా ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయి.
Read Also: బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానానికి బాంబు బెదిరింపు..
Follow Us On: Pinterest


