కలం, వెబ్ డెస్క్ : బాంబు బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం రేపింది. లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ (British Airways) విమానానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అత్యవసరంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు.
విమానం(British Airways)లో ఉన్న సుమారు 200 మందికి పైగా ప్రయాణికులను కిందకు దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల లగేజీని కూడా విడివిడిగా సోదా చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ విమానయాన సంస్థలకు వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తుండటం గమనార్హం.


