కలం, డెస్క్: విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురువులే.. విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. దారి తప్పిన విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సింది పోయి ఉపాధ్యాయులు దారితప్పుతూ గురువులకు మచ్చ తెస్తున్నారు. తన మాట వినడం లేదని ఓ విద్యార్థిని సీనియర్లచే విచక్షణ రహితంగా కొట్టించిన ఘటన మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగింది. హైదరాబాద్ – పేట్ బషీరాబాద్(Basheerabad) పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన వెలుగుచూసింది. 7వ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థి తన మాట వినడం లేదని ప్రధానోపాధ్యాయుడు కృష్ణ కోపంతో 10 తరగతి విద్యార్థులతో దాడి చేయించాడు. పాఠశాల ఆవరణలోనే సీనియర్ విద్యార్థులు చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
దాడి విషయం సూర్య తల్లిదండ్రులకు చెప్పడంతో ఘటన బయటకు వచ్చింది. ఇలా కొడుకు గాయాలతో ఇంటికి రావడంతో తండ్రి శివ రామకృష్ణ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. వెంటనే ఆయన పాఠశాలకు వెళ్లి హెడ్ మాస్టర్ ను నిలదీశారు. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పేట్ బషీరాబాద్(Basheerabad) పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు కృష్ణతో పాటు దాడికి పాల్పడిన విద్యార్థుల వివరాలను కూడా సేకరించారు.
Read Also: 12 మంది పిల్లలు. 5 పందులు.. విద్యారంగంపై కేటీఆర్ ట్వీట్!
Follow Us On: X(Twitter)


