కలం, వెబ్ డెస్క్: భారత్, జపాన్ బంధం ఎంతో ప్రత్యేకమని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. జపాన్ ప్రధాని టకాయిచి పర్యటనలో భాగంగా నిర్వహించిన ఇండియా-జపాన్ జాయింట్ ఎకానమిక్ ఫోరంలో ప్రసంగించారు. “రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యం ఎంతో బాగుందని చెప్పడానికి అనేక ఉదహరణలున్నాయి. ఈ మధ్యనే మారుతి సుజుకీ కార్ల కొత్త ప్లాంట్‌ను హరియాణాలోకి ఖర్కోడాలో ప్రారంభించాం. ప్రపంచ వ్యాప్తంగా విక్రయించే సుజుకీ కార్లలో మూడింట రెండు శాతం ఇక్కడే తయారు కాబోతున్నాయి. ఖర్కోడా ప్లాంట్ నుంచే వంద దేశాలకు ఎగుమతి కాబోతున్నాయి. జపాన్ భారత్‌లో పెట్టబడులు పెడితే దాని ప్రయోజనాలు మొత్తం ప్రపంచానికే అందుతున్నాయి” అని వివరించారు.
సరఫరా-గొలుసుల వ్యవస్థపై తీవ్ర ప్రభావం..
ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన పరిణామాల కారణంగా సరఫరా, గొలుసుల వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని ప్రధాని మోదీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా వాణిజ్య రంగం దిగజారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సమయంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందన్నారు. ప్రస్తుతం జీడీపీ 7.7 శాతంగా ఉందని, గత 12 ఏళ్లలో ఇది స్థిరంగా కొనసాగుతున్నట్లు వివరించారు. జపాన్‌లో కైజన్ సిద్ధాంతం ప్రకారం చెప్పాలంటే.. తాము నిరంతరం పురోగతి చెందుతూనే ఉన్నామని స్పష్టం చేశారు.
చాలా రంగాల్లో ప్రైవేట్ ద్వారాలు తెరిచాం..
కీలక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్లు ప్రధాని మోదీ అన్నారు. గత నాలుగేళ్లుగా ఇండియాలో మౌలిక సదుపాయాల కల్పనకు జపాన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఎంతో దోహదపడుతోందని ప్రశంసించారు. ప్రధాన మంత్రి కార్యాలయం నెలలో ఒక వారాన్ని జపాన్ వ్యాపార వారంగా మార్చినట్లు వివరించారు. పీఎంవో సీనియర్ అధికారులు ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై నిరంతరం సంప్రదింపులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
Read Also: తెలంగాణ గద్దెపై పాలమూరు బిడ్డ.. రాజకీయ జన్మకు మిడ్జిల్ అడ్డా
Follow Us On : WhatsApp

