epaper
Tuesday, November 18, 2025
epaper

రాత్రికి అభ్యర్థుల జాబితా రెడీ చేయండి: రేవంత్

స్థానిక ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల తొలి జాబితాను గురువారం రాత్రికి సిద్ధం చేయాలని ఇన్‌ఛార్జ్ మంత్రులు, ముఖ్యనేతలకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సూచించారు. గురువారం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో నామినేషన్లపై పూర్తి ఫోకస్ పెట్టాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్‌ఛార్జ్ మంత్రులు, పార్టీ కీలక నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. నామినేషన్ల దరఖాస్తు నమూనా పత్రాన్ని క్షేత్రస్థాయికి పంపాలని చెప్పారు. రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలని, వారికి బీఫారం ఇవ్వాలని, నో డ్యూ పత్రాలు ఇప్పించాలని వివరించారు.

‘‘న్యాయపరమైన అంశాల నివృత్తికి గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో ఒక కమిటీ ఉండాలి. టో‌ల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికను పీసీసీ నిర్ణయిస్తుంది. పీసీసీ నిర్ణయించే వరకు ఎవరూ కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసుపై పీసీసీ చీఫ్ పర్యవేక్షించాలి. ఉన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణపై రాత్ర మరో భేటీ నిర్వహిస్తాం. తొలివిడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలి’’ అని Revanth Reddy స్పష్టం చేశారు.

Read Also:  ట్రంప్ శాంతి సంతకాలపై మోదీ పోస్ట్.. ఏమన్నారంటే..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>