కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ మోసం (Crypto Currency Fraud) వెలుగు చూసింది. బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ పార్కింగ్ లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ. కోటి నగదును దుండగుడు కాజేశాడు. అత్తాపూర్ కు చెందిన బాధితుడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల ద్వారా భారీగా లాభాలు వస్తాయని తెలుసుకున్నాడు. దీంతో తనకు తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా పెట్టుబడి పెట్టేందుకు నిందితుడిని పరిచయం చేసుకున్నాడు.
ఈ క్రమంలో భారీ లాభాలు ఆశచూపించి నిందితుడు నమ్మించాడు. పెట్టుబడి కోసం నగదు తీసుకుని తాజ్ డెక్కన్ కు రావాలని చెప్పాడు. అతని మాటలు నమ్మిన బాధితుడు రూ. కోటి నగదుతో వెళ్లాడు. హోటల్ పార్కింగ్ నగదు తీసుకున్న కేటుగాడు క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు Crypto Currency Fraud పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


