కలం, వెబ్ డెస్క్ : నల్గొండ (Nalgonda) జిల్లా మాల్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీపై దాడి జరిగింది. రాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వెంకటయ్య ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులు దాడికి పాల్పడినట్లు సమాచారం. బీజేపీ, టీడీపీ మద్ధతుతో వెంకటయ్య గెలిచినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భద్రతను కట్టుదిట్టం చేసి దర్యాప్తు చేపట్టారు.


