కలం, వెబ్ డెస్క్: అండర్-19 ఆసియా కప్ 2025 (U19 Asia Cup 2025) ఫైనల్స్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాక్ చేతిలో చిత్తయింది. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 191 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇందులో భారత్ ఓటమిపై క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటమికి భారత బ్యాటర్ల వైఫల్యం ఒక్కటే కారణం కాదని, కెప్టెన్ ఆయుష్ మాత్రే తీసుకున్న టాస్ నిర్ణయం కూడా కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
U19 Asia Cup 2025 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆయుష్ ముందుగా బౌలింగ్‌ను ఎంచుకోగా, పాకిస్థాన్ ఈ నిర్ణయాన్ని తప్పుగా నిరూపిస్తూ 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత జట్టు ఒత్తిడికి లోనై కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్, ఫైనల్‌లో మాత్రం అదే స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది.
భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే కేవలం 2 పరుగులు చేసి ఔట్ కావడం జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 26 పరుగులతో మెరుపు ఆరంభం ఇచ్చినా, ఆ తర్వాత కీలక బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు. ఆరోన్ జార్జ్ (16), వేదాంత్ (9), విహాన్ (7) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. భారత ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడం జట్టు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ఆశ్చర్యకరంగా, బౌలర్ దీపేష్ 36 పరుగులతో భారత్ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
Read Also: గిల్‌పై వేటుకు రోహిత్ శర్మే కారణం: అశ్విన్
Follow Us On: X(Twitter)


