కరణ్ జోహార్(Karan Johar).. బాలీవుడ్‌లో టాప్ నిర్మాత. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితో కరణ్‌కు చాలా మంచి అనుబంధమే ఉంది. కరణ్‌తో అంతా చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. ఎంత పెద్ద హీరో అయినా.. కరణ్ చాలా కాజ్యువల్‌గా ఉంటాడు. అయితే తాజాగా అసలు బాలీవుడ్‌లో ఫ్రెండ్‌షిప్స్‌పై కరణ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్‌లో స్నేహాలు అన్నీ కూడా పార్టీల వరకే పరిమితమని, కష్టం వస్తే కనిచూపుమేరలో ఎవరూ కనిపించరని అన్నాడు. ఎలాంటి బంధాలైనా కూడా ఇండస్ట్రీలో డబ్బు, అవకాశాల కోసం మాత్రమే అవుతాయన్నారు. అంతేకాకుండా కొందరు నటవారసులపైన కూడా హాట్ కామెంట్స్ చేశాడు. కొందరు నటర వారసును ప్రోత్సహించడం కంటే గ్రూపులపైన ఆధారపడి స్నేహాన్ని చూపడం జరుగుతుందని వివరించాడు.
‘‘హీరోలు చాలా మంది నిర్మాతలతో కలిసి కష్టాలు పంచుకోవాలనుకోరు. మరీ ముఖ్యంగా డబ్బు, పారితోషికాల విషయంలో చాలా పక్కాగా ఉంటారు. వాటిపైన మాత్రమే ఫోకస్ పెడతారు. నేను లాస్ట్‌లో చేసిన రెండు సినిమాలు సరిగా రాణించలేదు. మీ డబ్బు తిరిగి ఇస్తా అని ఏ నటుడు ముందుకు రాలేదు. కానీ కావాల్సినంత తీసుకుంటారు. నాకు జీవితంలో ఏ ఫ్రెండ్ కూడా సహాయం చేయలేదు. అంతా వ్యాపారం కోసమే ఉన్నారు. నేను(Karan Johar) కూడా అంతే వ్యాపారం కోసమే ఇక్కడ ఉన్నా’’ అని చెప్పాడు.

