epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వైసీపీని అధికారంలోకి రానివ్వను: పవన్ కల్యాణ్

కలం, వెబ్‌డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వనని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)  పేర్కొన్నారు. ఆ పార్టీని శాశ్వతంగా అధికారంలోకి రానివ్వకుండా ఏం చేయాలో తనకు తెలుసన్నారు.

తాము అధికారంలోకి వచ్చేస్తామన్న భ్రమలో  ఆ పార్టీ నేతలు ఉన్నారని.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వనని పవన్ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జనసేన(Janasena) ఆధ్వర్యంలో నిర్వహించిన ’పదవీ – బాధ్యత‘(Padavi Badhyata) కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు.  తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ప్రజల కోసం పనిచేస్తామన్నారు.

దేశంలో కులం ఉండకూడదని పవన్ (Pawan Kalyan) ఆకాంక్షించారు. విద్యార్థి దశ నుంచే కులం లేకుండా చేయాలన్నారు. బీసీ స్కూళ్లు, ఎస్సీ స్కూళ్లు, గిరిజన స్కూళ్లు హాస్టళ్లు అని కాకుండా కామన్ స్కూళ్లు ఉండాలని ఆకాంక్షించారు. జనసేన పదవులు తీసుకున్న వాళ్లు సమాజంలో బాధ్యతగా ఎలా మెలగాలో సూచించారు. పదవి వచ్చిన నేతలు బాధ్యతగా వ్యవహరించాలని.. ప్రజల కోసం పనిచేయాలని కోరారు.

Read Also: ‘వైజాగ్‌లో అతిపెద్ద ట్రైబల్ ఈవెంట్.. విశేషాలివే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>