కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా సౌత్ రేంజ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీవో) సంయుక్త సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం చేయడంతో పాటు పీఆర్వో రికార్డులు తారుమారు చేసినట్లుగా విచారణలో తేలింది. ఈ మేరకు ఆమెను విధుల నుంచి తొలగిస్తూ డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. సంయుక్త బీట్ ఆఫీసర్గా పనిచేసిన సమయంలో కలప పేరుతో ఓ వ్యక్తి వద్ద నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేసినట్లుగా అధికారుల దృష్టికి వచ్చింది. ఫిర్యాదుల రూపంలో వచ్చిన ఆరోపణలన్నీ విచారణలో నిజమని గుర్తించారు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.

