తిలక్ వర్మ(Tilak Varma).. ప్రస్తుతం ఇండియా క్రికెట్‌లో టాప్ ఆర్డర్ బాట్స్‌మన్. ఆసియా కప్-2025 ఫైనల్స్‌లో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి ఇండియా క్రికెట్‌లో హీరోలా అయ్యాడు. అయితే ఇప్పుడు తిలక్‌కు కెప్టెన్ బాధ్యతలు వచ్చాయి. రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో హైదరాబాద్ జట్టును తిలక్ సారథ్యంలోనే బరిలోకి దిగనుంది. ఢిల్లీతో ఈ నెల 15న జరిగే మ్యాచ్‌లో తిలక్ కెప్టెన్‌గానే హైదరాబాద్ టీమ్ తలపడనుంది. ఈ విషయాన్ని హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది.
రంజీ ట్రోఫీలో కెప్టెన్ బాధ్యతలు రావడం తిలక్ చాలా మంచి అవకాశమని చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే బ్యాట్‌తో తానేంటో నిరూపించుకున్న తిలక్.. ఇప్పుడు కెప్టెన్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి మంచి ఛాన్స్ దొరికింది. ఇందులో బాగా రాణిస్తే.. బహుశా టీమిండియాలో కూడా అవకాశం దక్కొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు ప్రస్తుతం కెప్టెన్ల కొరత ఉంది. అది స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో కెప్టెన్‌గా తిలక్(Tilak Varma) తన సత్తా చాటితే.. టీమిండియాను ముందు నడిపించే ఛాన్స్‌ను తిలక్ చేతుల్లో పెట్టడంపై కూడా బీసీసీఐ ఆలోచించొచ్చని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
Read Also: ట్రోఫీలేని సెలబ్రేషన్స్ అతడి ఐడియానే: వరుణ్

