Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని వేగంగా చేపట్టాలి: కలెక్టర్ ప్రియాంక

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని వేగంగా చేపట్టాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Narayanpet Collector Priyanka) ఆదేశించారు. శనివారం ఆమె ఉట్కూర్ మండల కేంద్రంలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్థానిక కార్గిల్ చౌరస్తా, గ్రామ పంచాయతీ కార్యాలయాల సమీపంలో గల నివాసాలకు వెళ్ళి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో బోగస్ ఓట్లను మాత్రమే తొలగించడం జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించే ప్రసక్తే లేదని కలెక్టర్ (Narayanpet Collector) స్పష్టం చేశారు. ఇంటింటికి వచ్చే బీఎల్‌వో‌లకు ఓటర్లు సహకరించి, ఎన్యూమరేషన్ పత్రాలను తప్పక పూరించి ఇవ్వాలని ఆమె సూచించారు. ఎన్యూమరేషన్ పత్రాలను ఓటర్లు త్వరగా నింపేటట్లు బీఎల్‌వో‌లు, బీ‌ఎల్‌ఏ‌లు చొరవ తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అశోక్ కుమార్, ఎంఈవో మాధవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: అమ్రాబాద్ ఫారెస్ట్‌లో ఎన్ని పులులు ఉన్నాయంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>