Mobile Popup Ad
Mobile Popup Ad

వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

కలం, సినిమా : విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Venkatesh–Trivikram) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”ఆదర్శ కుటుంబం”(Aadarsha Kutumbam). చాలా కాలం తరువాత వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో డైరెక్ట్ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘ఆదర్శ కుటుంబం’ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. కుటుంబ ప్రేక్షకులను అలరించే ఈ చిత్రం  అక్టోబర్ 2, 2026 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

“ప్రతి కుటుంబం గుర్తుంచుకునే ఒక తేదీ.. ‘ఆదర్శ కుటుంబం’ తలుపులు అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా తెరుచుకోనున్నాయి” అంటూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ను వెల్లడించింది. ఈ ప్రకటనతో అభిమానులలో  సినిమాపై (Aadarsha Kutumbam) అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు  త్రివిక్రమ్ తనదైన శైలిలో కుటుంబ భావోద్వేగాలు, వినోదాన్ని మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ సమర్పిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్  అందిస్తున్నారు. దసరా సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం కోసం  సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: అమ్రాబాద్ ఫారెస్ట్‌లో ఎన్ని పులులు ఉన్నాయంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>