ఎంజీయూలో పార్ట్ టైమ్ అధ్యాపకుల పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

కలం, నల్లగొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MG University) పరిధిలో నూతనంగా ఏర్పాటైన లా కళాశాలలో పార్ట్ టైమ్ అధ్యాపకుల ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే లా తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఎల్ఎల్‌బి, ఎల్ఎల్ఎమ్ కోర్సులకు సంబంధించి ఫ్యామిలీ లా, కాన్స్టిట్యూషనల్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, లా ఆఫ్ టార్, లా ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా స్పెషలైజేషన్లలో అధ్యాపకులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు ఎల్ఎల్ఎమ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్టులలో పీహెచ్‌డీతో పాటు బోధనా అనుభవం కలిగి ఉండాలి.

ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను జూలై 10వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు విశ్వవిద్యాలయ (MG University) రిజిస్ట్రార్ కార్యాలయంలో నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించాల్సి ఉంటుందని ఆచార్య కొప్పుల అంజిరెడ్డి స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Read Also: అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్‌కు చిట్ట చివరి స్థానం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>