కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం(CMO)లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్నటి ఐఏఎస్ బదిలీల్లో భాగంగా సీఎంఓ మాజీ స్పెషల్ సెక్రటరీగా ఉన్న అజిత్ రెడ్డి (Ajith Reddy) ని ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. అదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్ కు ముఖ్యమంత్రి కార్యాలయంలో చోటు కల్పించారు. దీంతో ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డిని నియమించారు. అయితే తాజాగా అజిత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం మరో అదనపు బాధ్యత అప్పజెప్పింది.
ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా నియమితులైన సీఎంఓ మాజీ స్పెషల్ అజిత్ రెడ్డిని (Ajith Reddy) హైదరాబాద్ మెట్రో రైలు అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు.
Read Also: అమ్రాబాద్ ఫారెస్ట్‌లో ఎన్ని పులులు ఉన్నాయంటే?
Follow Us On: Instagram

