కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా వర్ని మండలంలో తల్లి, కూతుళ్లు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. సత్యనారాయణపురం గ్రామానికి చెందిన తల్లి మంగలి కల్పన(27) తో పాటు ఇద్దరు కుమార్తెలు అక్షర (4), శ్రీ విద్య (2) అదృశ్యం అయ్యారు. ఈ నెల 22 తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాలేదని, పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదని భర్త మంగలి లచ్చయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

