Mobile Popup Ad
Mobile Popup Ad

కోలీవుడ్‌లో విషాదం.. డైరెక్ట‌ర్‌ భాగ్యరాజ్ హ‌ఠాన్మ‌ర‌ణం!

క‌లం, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు భాగ్య‌రాజ్ (Bhagyaraj) గుండెపోటుకు గుర‌య్యారు. చెన్నైలోని ఆయ‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. భాగ్య‌రాజ్ మృతితో సినీ ప్ర‌ముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఆయ‌న మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. భాగ్య‌రాజ్ సుమారు 75కి పైగా సినిమాల్లో న‌టించారు. తెలుగులో కూడా ప‌లు సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న 25 సినిమాల‌కు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌స్తుతం భాగ్య‌రాజ్ ఇంటి వ‌ద్ద‌కు కుటుంబ‌స‌భ్యులు, సినీ ప్ర‌ముఖులు చేరుకుంటున్నారు. భాగ్య‌రాజ్‌కు భార్య‌ న‌టి పూర్ణిమ జయరాం, ఇద్దరు పిల్లలు శరణ్య, శంతను ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>