కలం, వెబ్ డెస్క్ : పపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli).. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi) . ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత అయితే.. ఎప్పుడెప్పుడు ఈ మూవీని రిలీజ్ చేస్తారా అని సూపర్ స్టార్ అభిమానులే కాదు.. సినీ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించిన ఓ సీక్రెట్ ను ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) బయటపెట్టింది. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇంతకీ.. ప్రియాంకా ఏం లీక్ చేసింది..?
బాహుబలి సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. దీంతో భారతీయ సినిమా సత్తా ఏంటి అనేది తెలిసింది. ఇక అక్కడ నుంచి బడ్జెట్లు బాగా పెరిగాయి. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీయడం అనేది కామన్ అయ్యింది. అల్లు అర్జున్, అట్లీ మూవీని దాదాపు 700 కోట్లు బడ్జెట్ తో తీస్తున్నారని వార్తలు వచ్చాయి. రామాయణం అయితే.. రెండు పార్టులకు కలిపి 4,000 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టుగా స్వయంగా నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) తెలియచేశారు. అయితే.. రాజమౌళి వారణాసి బడ్జెట్ ఎంత అనేది ఆసక్తిగా మారింది.
1000 కోట్ల బడ్జెట్ తో వారణాసి రూపొందుతోందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అసలు విషయం ప్రియాంకా చోప్రా బయటపెట్టింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రియాంక తాజాగా కపిల్ శర్మ నిర్వహించే టీవీ షోకు గెస్ట్ గా హాజరైంది. ఈ సందర్భంగా వారణాసి సినిమా బడ్జెట్ 1300 కోట్లట కదా అని కపిల్ శర్మ అడిగితే.. అందుకు ప్రియాంక అవును అని చెప్పింది. ఈ విధంగా వారణాసి బడ్జెట్ ఎంత అనేది బయటకు వచ్చింది. అయితే.. కథ ఏంటి అని అడిగితే మాత్రం ఏం చెప్పలేదు. 1300 కోట్లు బడ్జెట్ తో తీస్తున్న వారణాసి (Varanasi) తెలుగులో ఇంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఫస్ట్ సినిమా కాగా.. ఇండియాలో సెకండ్ మూవీగా నిలిచింది.
Read Also: వైజాగ్‌లో అతిపెద్ద ట్రైబల్ ఈవెంట్.. విశేషాలివే!
Follow Us On: X(Twitter)


