Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ పేరుతో కేటీఆర్ రాజ‌కీయాలు: అద్దంకి దయాకర్

కలం, వెబ్ డెస్క్: మాజీ సీఎం కేసీఆర్ హాయిగా రెస్టు తీసుకుంటుంటే ఆయ‌న పేరు చెప్పుకుని కేటీఆర్ (KTR) రాజ‌కీయాలు చేస్తున్నాడని కాంగ్రెస్ నేత, ప్ర‌భుత్వ విప్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చెప్పే అబ‌ద్దాల‌ను ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా న‌మ్మ‌డం లేదని ఎద్దేవా చేశారు. ఒక అబ‌ద్దాన్ని ప‌దే ప‌దే చెప్పితే చెవుల్లోనుంచి ర‌క్తం వ‌చ్చి పారిపోతార‌న్న విష‌యం కేటీఆర్ తెలుసుకోవాలని విమర్శించారు. కేసీఆర్ చెప్పిన మాట‌లు వింటే ప్ర‌జ‌లు నిజంగా మోసం పోయేవారని.. కేసీఆర్ మ‌ళ్లీ గెలిస్తే ప్ర‌జాస్వామ్యం ప‌క్క‌న పెట్టి రాజ‌రికం వ‌చ్చేందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మాట‌లు న‌మ్మ‌కుండా.. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు న‌మ్మ‌డం వ‌ల్ల ప్ర‌జాస్వామ్యం బ‌తికిందని అన్నారు.

బీఆర్ఎస్‌లో చేరిన త‌ర్వాత జీవ‌న్ రెడ్డికి (Jeevan Reddy) తమ ప్రభుత్వం నిర్మించిన 100 ఇంటిగ్రేటేడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, స్కాల‌ర్ షిప్‌లు క‌నిపించ‌డం లేదని దుయ్యబట్టారు. దేశంలోనే మొద‌టిసారి ప్ర‌భుత్వ స్కూల్స్, క‌ళాశాల‌ల్లో 800 కోట్ల‌తో బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్ర‌వేశ పెట్టామని చెప్పారు. స్కూల్ పిల్ల‌ల‌కు ప్ర‌త్యేకంగా యంగ్ ఇండియా స్కూల్ కిట్ ల‌ను అందజేశామని చెప్పారు.

రేవంత్ రెడ్డి పాలనలో ప్ర‌భుత్వపాఠశాలల్లో16 శాతం హాజ‌రు పెరిగిందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ప‌దేళ్ల‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం డైట్ ఛార్జీలు పెంచ‌లేదని విమర్శించారు. జీవ‌న్ రెడ్డి లాంటి నాయ‌కుడు కూడా బీఆర్ఎస్ మాయ‌లో ప‌డి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాడని మండిపడ్డారు. ప్ర‌జ‌లు త‌ప్పు చేయ‌రని.. వాళ్ల‌కి ఎవ‌రిని గెలిపించాలో, ఎవ‌రిని ఓడించాలో తెలుసు అంటూ దయాకర్ (Addanki Dayakar) వ్యాఖ్యానించారు.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>