Mobile Popup Ad
Mobile Popup Ad

బిగ్ అలర్ట్.. మూడు రోజులు EPFO పోర్టల్‌ బంద్

కలం, వెబ్ డెస్క్: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి మూడు రోజుల పాటు పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి జూన్‌ 29న రాత్రి 11:59 గంటల వరకు పోర్టల్ పనిచేయదు. ఈ సమయంలో కొత్త ఈపీఎఫ్ క్లెయిమ్‌ చేయడం, క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ వంటి పలు కీలక ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. అవసరమైన పీఎఫ్ సేవలను ఈ రోజే పూర్తి చేసుకోవాలని సూచించింది.

మరింత సమర్థవంతంగా పీఎఫ్ సేవలు..

EPFO పోర్టల్ సిస్టమ్‌ను మరింత వేగంగా, సమర్థవంతంగా మార్చేందుకే సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దడంతో పాటు ట్రాఫిక్ ను తట్టుకునేలా కొత్త సాఫ్ట్ వేర్స్ డిజైన్ చేసినట్లు వెల్లడించింది. ఆయా పనుల కారణంగా మూడు రోజుల పాటు పోర్టల్ నిలిపివేయాల్సి వస్తుందని తెలిపింది. పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయడం, ట్రాన్స్‌ఫర్ చేసేవారు అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవాలని పీఎఫ్ అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>