Mobile Popup Ad
Mobile Popup Ad

గోల్డ్ మ్యాన్ సూర్య‌ అరెస్ట్..!

క‌లం, వెబ్ డెస్క్: న‌కిలీ బంగారు ఆభ‌ర‌ణాల‌తో సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన‌ గోల్డ్ మ్యాన్‌ సూర్య భాయ్‌ (Gold Man Surya Bhai) మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ప్ర‌స్తుతం సూర్య‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. త‌న‌కు పెద్ద పెద్ద ప‌రిచయాలు ఉన్నాయ‌ని, సీఎం రేవంత్ రెడ్డి, బ‌డా పోలీస్ ఆఫీస‌ర్ల స‌పోర్ట్ త‌న‌కు ఉంద‌ని చెప్పుకుంటూ మోసాల‌కు పాల్ప‌డ్డట్లు తెలుస్తోంది.

అతి త‌క్కువ ధ‌ర‌కే బంగారం ఇప్పిస్తాన‌ని, ఈ బంగారాన్ని విదేశాల నుంచి తెప్పిస్తున్నాన‌ని సూర్య‌ ప‌లువురిని న‌మ్మించాడు. అత‌డి మాట‌లు న‌మ్మి కొంద‌రు భారీ మొత్తంలో డ‌బ్బులు చెల్లించారు. అయితే ఎంత‌కీ బంగారం ఇవ్వ‌క‌పోవ‌డంతో మోస‌పోయామ‌ని గుర్తించారు. సూర్య బాధితులు అత్తాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నేడు సూర్య‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచార‌ణ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు ఇలాంటి మోస‌గాళ్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>