కలం వెబ్ డెస్క్ : కేసీఆర్ (KCR) తోలు తీస్తామంటే తీయించుకోవడానికి ఎవరూ సిద్దంగా లేరని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. కేసీఆర్ ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ (BRSLP) సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పని చేస్తుందని చెప్పారు. కేసీఆర్ తోలు తీస్తామంటూ ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. పదేళ్లు పాలించిన మీకు ప్రజలు ప్రతి ఎన్నికలో తోలు తీస్తూనే ఉన్నారని విమర్శించారు.
కేసీఆర్ (KCR) అసెంబ్లీకి వచ్చి ఏ అంశాలైనా ప్రజలు ముందు ఉంచాలని పొన్నం (Ponnam Prabhakar) సూచించారు. అత్యద్భుతం అని కొనియాడుతూ, మాటలకే పరిమితమైన బంగారు తెలంగాణ నిజ స్వరూపాన్ని, ఎవరు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నానే విషయాన్ని కేసీఆర్ కుటుంబసభ్యురాలైన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపై కక్షసాధింపు చర్యలు చేపట్టదని, అప్రజాస్వామికంగా వ్యవహరించదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కాంగ్రెస్ భావిస్తుందన్నారు.
Read Also: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు సవాల్
Follow Us On: Instagram


