కలం, వెబ్ డెస్క్ : భారతదేశ పర్యటనలో ఉన్న అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ (Amazon CEO Andy Jassy) న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, 2030 నాటికి భారతదేశంలో ఏఐ (AI), క్లౌడ్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి అమెజాన్ అదనంగా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు జస్సీ ప్రకటించారు. ఈ పెట్టుబడులతో, రాబోయే ఐదేళ్లలో దేశంలో అమెజాన్ పెట్టే మొత్తం మూలధనం 48 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.
“2030 నాటికి, తాము 3.8 మిలియన్ల ఉద్యోగాలతో పాటు 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులను సులభతరం చేయాలని, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు, 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందించాలని ప్రణాళికలు రచిస్తున్నాం” అని సీఈవో జెస్సీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Instagram

