epaper
Tuesday, November 18, 2025
epaper

ట్రోఫీలేని సెలబ్రేషన్స్‌ అతడి ఐడియానే: వరుణ్

ఆసియా కప్-2025 ఫైనల్స్ నెవ్వర్ బిఫోర్ అన్న విధంగా ఉన్నాయి. మ్యాచ్ ఒక్కటే కాదు.. ఛాంపియన్‌గా గెలిచి ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నో చెప్పడం కూడా ఫ్యాన్స్ ఎక్కడలేని కిక్ ఇచ్చింది. భారత్ అంటే ఇది.. దాయాది నేత నుంచి ట్రోఫీ తీసుకోవడమే.. జరిగే పనికాదని టీమిండియా ప్లేయర్స్ చెప్పారు. అయితే టోర్నీ ఆఖర్లో టీమిండియా ప్లేయర్లు ట్రోఫీ లేకుండానే గాల్లో చేతులు ఎత్తి సెలబ్రేట్ చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో అయితే.. బీభత్సవంగా వైరల్ అయింది. ట్రోఫీ తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే.. లేని ట్రోఫీ ఉన్నట్లు సెలబ్రేట్ చేసుకోవడం మరో ఎత్తు అంటూ ఫ్యాన్స్ అన్నారు. అదే సమయంలో అసలు ఈ ఐడియా ఇచ్చిన మహానుభావుడు ఎవరు? అన్న ప్రశ్నగా కూడా బలంగానే వినిపించింది. దానికి తాజాగా వరుణ్ చక్రవర్తీ(Varun Chakravarthy) సమాధానం ఇచ్చాడు. ఆ సెలబ్రేషన్స్ వెనక అర్ష్‌దీప్ సింగ్(Arshdeep) హస్తం ఉందని వివరించాడు.

‘‘ట్రోఫీ వస్తుందేమో అని చాలా సేపు వెయిట్ చేశాం. కానీ రాలేదు. అప్పుడు ఏం చేయాలా అని అంతా ఆలోచిస్తుంటే అర్ష్‌దీప్ ఒక ఐడియా ఇచ్చాడు. కప్ అందుకున్నట్లే చేద్దాం.. అన్నాడు. ఆ తర్వాత ఫొటోలు మార్చుకోవచ్చన్నాడు. అంతే అంతా అదే చేశాం. నేను కూడా చేశా. నేను బెడ్‌పై పడుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. నా పక్కన ట్రోఫీ ట్రోఫీ ఉంటుందనుకుంటే కాఫీ కప్‌ ఉంచారు’’ అని చెప్పాడు వరుణ్(Varun Chakravarthy). ‘‘ట్రోఫీ లేకుండా సంబరాలు చేసుకోవడం చాలా కొత్తగా ఉంది. మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో అద్భుతమైన వాతావరణం ఉంది. కప్‌ ఉన్నట్లే సంబరాలు చేసుకున్నాం’’ అని సంజు శామ్‌సన్‌ అన్నాడు.

Read Also: రష్మిక స్పీడుకు రుక్మిణి బ్రేకులు వేస్తోందా..?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>