epaper
Tuesday, November 18, 2025
epaper

గీత దాటితే జగన్‌పై క్రిమినల్ చర్యలే.. డీజీపీ వార్నింగ్

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్.. నర్సీపట్నం పర్యటన ఈరోజు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ హెచ్చరికలు చేయడం జరిగింది. పోలీసులు పెట్టిన షరతులను జగన్ తూచా తప్పకుండా పాటించాలని, ఏమాత్రం గీత దాటినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడం, వాహనాలను ఎక్కువసార్లు ఆపడం, భారీగా జన సమీకరణ చేయడం వంటివి చేస్తే అనుమతులు వెంటనే రద్దవుతాయని హెచ్చరించారు. నిబంధనలని ఉల్లంఘిస్తే రాజకీయ హోదా, పార్టీతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలీసులు జీరో టాలరెన్స్ పద్దతిని అవలంబిస్తున్నారని వివరించారు.

పోలీసుల కండిషన్లు ఇవే..

జగన్(YS Jagan) ప్రయాణించే మార్గంలో ఊరేగింపులు, ర్యాలీలు, ప్రదర్శనలు, భారీ జన సమీకరణ చేయకూడదు.

అనుమతించిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో రాజకీయ నినాదాలు, స్వాగతాలు, సభలు పెట్టకూడదు.

కార్యకర్తలను, జనాన్ని సమీకరించడం, ట్రాఫిక్‌ను ఆపే ప్రయత్నాలు చేసినా వాటిని నిబంధనల ఉల్లంఘనగానే పరిగణిస్తాం.

అనుమతులు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటాం. పోలీసు ఏర్పాట్లు ప్రజల రక్షణ కోసమే. ఏదైనా ప్రమాదం, ఆస్తి నష్టం జరిగితే నిర్వాహకులదే బాధ్యత. దానికి వాళ్లు లిఖిత పూర్తకంగా హామీ ఇవ్వాలి అని డీజీపీ(Harish Kumar Gupta)  చెప్పారు.

Read Also: భారత్‌తో మళ్ళీ యుద్ధం జరగొచ్చు: పాక్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>