కలం, వెబ్ డెస్క్: రష్యా కంట్రీ కార్మికుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటుంది. పనికోసం ఇతర దేశస్తులు అక్కడికి వెళ్తున్నారు. అలా నాలుగు నెలల క్రితం రష్యాకు వెళ్లిన 17 మంది భారతీయుల్లో (Indians) 26 ఏళ్ల ముఖేష్ మండల్ ఉన్నాడు. గతంలో సాఫ్ట్ వేర్‌గా (Software Engineer) పనిచేశాడు. ముఖేష్ మండల్ క్లీనర్‌గా మారి వీధులను శుభ్రపరుస్తున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెకీగా పనిచేస్తున్న అతను క్లీనర్‌గా అవతారమెత్తడంతో చాలామంది షాక్ అయ్యారు. ఇదే విషయాన్ని అతన్ని అడగ్గా.. ఇలా సమాధానమిచ్చాడు.
“నేను మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఎక్కువగా పనిచేశా. AI, చాట్‌బాట్‌లు, GPT లాంటి టెక్నాలజీని వాడాను. నేను డెవలపర్‌ని, మంచి నైపుణ్యం ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో క్లీనర్‌గా పనిచేస్తున్నా. పనే నాకు దైవం, అందుకోసం ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. ఏ పనైనా చేయొచ్చు” అని ఇంగ్లీష్‌లో చెప్పాడు. ఇండియా నుంచి వచ్చిన 17 మంది కార్మికులకు రష్యా ప్రభుత్వం ఆహారం, వసతిని అందిస్తోంది. ప్రతి కార్మికుడు దాదాపు దాదాపు ₹ 1.1 లక్షలు సంపాదిస్తున్నట్లు సమాచారం. వీధులు శుభ్రచేయడం, చిత్తు కాగితాలు ఏరడం వీరి పని.
Read Also: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్స్.. వడ్డీ ఎక్కువ రిస్క్ తక్కువ
Follow Us On: Youtube


