కలం వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లా(NTR District)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు యువకులు బాలికపై గ్యాంగ్ రేప్(gang rape)కు పాల్పడ్డారు. సత్తెనపల్లిలోని ఓ లాడ్జిలో బాలికపై రేప్ చేశారు. ఈ ఘటనలో నిందితులు రాహుల్, భరత్, ప్రదీప్ లను పోలీసులు(police) అరెస్ట్(arrested) చేశారు. ఘటనకు బాధ్యులైన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఇన్స్టాగ్రామ్లో నిందితులు బాలికతో పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారడంతో ఈ దారుణ ఘటనకు దారితీసింది. ఒసారి కలుద్దామని చెప్పి బాలికను బయటకు పిలిచారు. వారి మాటలు నమ్మి వచ్చిన బాలికను నిందితులు అనుకున్న పథకం ప్రకారం కారులో వారితో తీసుకెళ్లారు. అనంతరం ఈ దారుణం జరిగింది. ఈ ఘటన ఈనె 18న వాంబేకాలనీలో జరిగింది. తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. త్వరలో మిగిలిన ఇద్దరిని కూడా పట్టుకుంటామని చెప్పారు.
Read Also: తాగి రోడ్డెక్కుతున్నారు.. 800 మంది మందుబాబులపై కేసులు
Follow Us On: Pinterest


