కలం, వెబ్ డెస్క్: ఎన్డీయే (NDA) కూటమి నుంచి టీడీపీ వైదొలగాలని యోచిస్తోందంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఖండించారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లని కొట్టిపారేశారు. మాజీ ఉపరాష్ట్రపతితో తాము ఎన్డీయే నుంచి తప్పుకునే విషయమై చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ విషయాన్ని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి వివరణ ఇచ్చానని లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కొనసాగుతుందని, భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.
ప్రతి మూడు నుంచి ఆరు నెలలకొకసారి ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని, వీటికి పదేపదే వివరణ ఇచ్చుకోవాల్సి రావడం విచారకరమన్నారు. తాను హాజరైన సమావేశాలు, జరిగిన చర్చల వివరాలను ప్రధానమంత్రికి వివరించగా.. మోదీ ఆ పుకార్లను నవ్వి కొట్టేశారని లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ఒకవేళ అలాంటి పరిణామాలు ఏవైనా ఉంటే తన దృష్టికి వచ్చేదని, తానే స్వయంగా వివరణ కోరేవాడినని ప్రధాని అన్నట్లు పేర్కొన్నారు. పుకార్లు వస్తాయనే భయంతో ముఖ్యమైనవారిని కలవడం మానేయవద్దని ప్రధాని తనకు సూచించారని లోకేశ్ వెల్లడించారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Instagram

