కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కుండపోత వర్షాలు బీభత్సాన్ని (Red Alert in Mumbai) సృష్టిస్తున్నాయి. రాజధానిపాటు థానే, పుణెలోనూ భారీ వర్షాలు కురవటంతో జనజీవనం అతలాకుతలం అయింది. పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునగటంతో చెరువులను తలపించాయి. భారీ వర్షానికి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లు, రైల్వే రహదారులు లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయి. కుండపోత వానకు ముంబైలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మోకాళ్లలోతు నీరు చేరడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు.
సియాన్ సబ్ వే పూర్తిగా నీట మునిగింది. ముంబైలో సగటున 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదమయింది. వర్షాల ధాటికి భారీ వృక్షాలు నేలకూలడంతో వాహన రాకపోకలు నిలిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Red Alert in Mumbai) జారీ చేసింది. మరో 24 గంటలపాటు వర్షాలు ఉంటాయని, నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Sharechat

