Mobile Popup Ad
Mobile Popup Ad

ఖబడ్దార్ జాగ్రత్త.. వైసీపీకి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ సాయికృష్ణ కేసులో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై జొన్నగిరి సభలో సీఎం చంద్రబాబు (Chandrababu) స్పందించారు. కులం, మతం, ప్రాంతాల వారీగా ప్రజల్ని విడగొట్టాలని గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సాయికృష్ణ కేసులో (Sai Krishna Case) కులం కార్డును ఉపయోగించి పవన్ కళ్యాణ్ ను బద్నాం చేయాలని వైసీపీ ప్రయత్నించిందని మండిపడ్డారు. ఆ కేసులో సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడేనని .. దానికి కూడా రాజకీయ రంగు పులిమి పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఖబడ్దార్ జాగ్రత్త.. అనవసరంగా నోరు పారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీయేకు ఉందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ (Tirumala Laddu) నెయ్యిలో కల్తీ చేసిన గొడ్డలి పార్టీ నాయకుడు ఇప్పుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాడని వైసీపీ అధినేత జగన్‌ను (YS Jagan) ఉద్దేశించి సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రజలను వచ్చించేందుకు ఆలయాలకు వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్ని దండాలు పెట్టినా దేవుడిని నమ్మే ఏ ఒక్కరూ ఆయనకి సహకరించారన్నారు. నచ్చిన మతాన్ని ఆచరించుకో .. కానీ మళ్లీ తిరుమల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ జగన్‌ను సీఎం(Chandrababu) హెచ్చరించారు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిని శిక్షిస్తామని స్పష్టం చేశారు.

Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>