కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) కార్పొరేషన్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. 40వ డివిజన్ హనుమాన్ నగర్లోని బ్లూబెల్స్ స్కూల్ పక్కన వీధిలో రహదారి వెంబడి డ్రైనేజీ నిర్మాణం కోసం పెద్ద గుంతను తవ్వి ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. స్కూల్ పక్కనే పిల్లలు వందలాది మంది రోజు వస్తూ పోతుంటారని, కనీస హెచ్చరికలు లేకుండా పనులు చేయడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు వెంటనే సమాధానం చెప్పాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు డిమాండ్ చేశారు. రోడ్డును తవ్వినప్పుడు ఎలాంటి బోర్డు లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఏమైనా జరిగితే కాంట్రాక్టర్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

