నిర్మల్ రోడ్లకు మహర్దశ.. రూ. 71 కోట్లు విడుదల

కలం, నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి హ్యమ్ పథకం కింద భారీగా నిధులు మంజూరు చేసిందని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ (Nirmal) నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు మంగళవారం తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు పట్టణ పరిధిలో రహదారుల అభివృద్ధికి రూ.71 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

ఈ నిధులను ప్రధానంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మత్తులు, విస్తరణ పనులు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>