Mobile Popup Ad
Mobile Popup Ad

‘సర్‌’పై మైనార్టీలు అపోహలు వీడండి: ఎండీ ముజీబ్

కలం, కరీంనగర్ బ్యూరో: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై మైనార్టీ వర్గాలు అపోహలు వీడాలని బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ముజీబ్ కోరారు. మంగళవారం కరీంనగర్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈనెల 25 నుంచి ప్రారంభం కాబోతున్న సర్ విషయంలో మైనార్టీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు ఒత్తిడికి గురికావద్దన్నారు.

ఇతర దేశాల నుంచి వచ్చి, అక్రమంగా దేశంలో ఓటు హక్కు పొందిన వారిని గుర్తించి, వారి ఓట్లను మాత్రమే తొలగిస్తారని వివరించారు. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా జరిగే సాధారణ ప్రక్రియ అన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. దేశ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా ఉంచేందుకు, అర్హులైన వారికే ఓటు హక్కు ఉండేలా చూడటానికి రివిజన్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇది ఏ ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నది కాదని, కేవలం నిబంధనల మేరకు అక్రమ ఓట్లను తొలగించి, జాబితాను సరిచేసే ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు.

Read Also: రమ్మంటున్న కేటీఆర్.. రానంటున్న కేసీఆర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>