Mobile Popup Ad
Mobile Popup Ad

వీధి వ్యాపారులకు అండగా పీఎం స్వనిధి: ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో : వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal) అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ స్వనిధి మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు వ్యాపారం నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రుణాలను అందజేస్తుందన్నారు.

ఇందులో భాగంగా మొదటిసారి 10 వేలు ఇస్తారని, వాయిదాలు క్రమంగా చెల్లిస్తే అంతకు మించి రుణాలను ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ (Atmanirbhar Bharat) లో భాగంగా విధి వ్యాపారులకు అండగా నిలుస్తున్నారన్నారు. మహిళలు రుణాలు పొందడంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, నగరవాసుల్లో మరింత చైతన్య పెరిగింది అన్నారు.

అనంతరం మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal) సందర్శించారు. డిజిటల్ పే చేసి పలు వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, బీజేపీ కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, మఠం పవన్, జ్యోతి మురళి, కల్పే అర్చనా చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీణ్, సువర్ణ వేణుగోపాల్, మెప్మా డీఎంసీ మాధురి లత, ఏడీఎంసి నందన్ రెడ్డి, సీవో లు శోభారాణి, అర్చన, ఆయా బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.

Read Also: రాగి పాత్రలో నీరు తాగుతున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రమాదమే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>