epaper
Friday, January 16, 2026
spot_img
epaper

కేసీఆర్​ ఆర్థిక ఉగ్రవాది : సీఎం రేవంత్​ రెడ్డి

కలం, వెబ్ డెస్క్​ : కేసీఆర్​ ఆర్థిక ఉగ్రవాది అని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ( Revanth Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వంపై కేసీఆర్​ చేసిన విమర్శలపై ఆదివారం నిర్వహించిన మీడియా చిట్ చాట్​ లో ఆయన స్పందించారు. ’కేసీఆర్​(KCR) ఇప్పటికైనా మారుతారని ఆశించాను. కానీ, ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. రాజకీయంగా భిక్ష పెట్టిన ప్రాంతం గురించి అసత్యాలు ప్రచారం చేశారు. కేసీఆర్​ కు అహంకారం తగ్గడం లేదు.. ఇప్పటికైనా అబద్ధాలు మానాలి. బీఆర్​ఎస్(BRS) దోపిడి లెక్కలు మొత్తం బయటకు తీస్తా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ నేత కేసు వేశాడు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. నీళ్లు, నిజానిజాలపై చర్చిద్దాం. అసెంబ్లీ వేదికగా ముఖాముఖి చర్చకు సిద్ధం‘ అంటూ రేవంత్​ రెడ్డి, కేసీఆర్​ కు సవాల్​ విసిరారు.

Read Also: కేసీఆర్ ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>