కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పాలనలోనే తీరని అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ (Uttam Kumar Reddy) పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన ఆరోపణలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1400 టీఎంసీలను ఏపీ అక్రమంగా తరలించుకుపోయిందని విమర్శించారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కండ్లు మూసుకొని కూర్చున్నదా? అంటూ ప్రశ్నించారు.
సమైక్య ఆంధ్రలో కంటే కేసీఆర్ పాలనలోనే పాలమూరు(Palamuru) జిల్లాకు ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో జలదోపిడీని అరికట్టగలిగామని చెప్పారు. ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించాము.’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీటి రంగానికి లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ ఏం చేయలేదు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు ఇప్పటికీ వడ్డీ కడుతున్నాం. కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీకి ఎక్కువ నీటి తీసుకుపోవడానికి కేసీఆర్ కారణం’ అంటూ ఉత్తమ్ (Uttam Kumar Reddy) విమర్శించారు. తమ ప్రభుత్వం పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు ఆపాలని రిట్ పిటిషన్ వేసిందని గుర్తు చేశారు.
పదేండ్లు అధికారంలో ఉండి దేవాదులను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు 27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు తీసుకురాలేదని విమర్శించారు. తమ పాలనలో పాలమూరు ఎత్తిపోతల పథకం మీద 7 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండానే మీడియా ముందుకొచ్చి మాట్లాడారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలోనే వరి ధాన్యం ఎక్కువగా పండిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు గణాంకాలతో సహా బయటపెడతామన్నారు.
Read Also: కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Youtube


