Mobile Popup Ad
Mobile Popup Ad

బాలకృష్ణ-కొరటాల శివ కాంబోకి శుభ ముహూర్తం ఖరారు

కలం, సినిమా : నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘NBK112’ చిత్రానికి శుభ ముహూర్తం ఖరారైంది. గాడ్‌ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ జూన్ 25న ఉదయం 9 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటపాలెం వద్ద ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమం జరగనుంది. ఈ శుభ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ హాజరుకానున్నారు.

బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ సినిమాపై భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. సామాజిక అంశాలతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో కొరటాల శివకు ఉన్న ప్రత్యేక గుర్తింపు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రారంభ వేడుకతోనే భారీ హైప్ సొంతం చేసుకున్న ‘NBK112’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>