epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేవంత్ రెడ్డి సొంత జిల్లాపై కేసీఆర్ టార్గెట్

కలం, వెబ్‌డెస్క్: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) సొంత జిల్లాను టార్గెట్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. అయితే కేసీఆర్ (KCR) ఉన్నట్టుండి సడెన్‌గా ఉమ్మడి పాలమూరు జిల్లా మీద ఫోకస్ పెట్టడం చర్చనీయాంశం అయ్యింది.

రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడా రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురాకుండా ఆయన సొంత జిల్లా మీద టార్గెట్ చేశారు. పాలమూరు జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని.. 300 కిలోమీటర్లు పారే కృష్ణా జిల్లాలో పాలమూరు తీవ్ర అన్యాయానికి గురైందన్నారు. ప్రాజెక్టులు ఉన్నా ఒక్క చుక్క నీరు కూడా ఆ జిల్లాకు రాలేదని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా కూడా పాలమూరు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు.

గతంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్(KCR) వల్లే పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. ఈ జిల్లాలో బీఆర్ఎస్ పాలనలో పెద్దగా ప్రాజెక్టులు నిర్మించలేదని చెప్పారు. దీంతో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలను ఎలా ఎదుర్కోబోతున్నారో వేచి చూడాలి.

Read Also: చంద్రబాబు దత్తత వల్లే ఆ జిల్లాకి అన్యాయం -KCR

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>