కలం, వెబ్డెస్క్: దక్షిణాఫ్రికాలోని జొహాన్సెస్బర్గ్లో జరిగిన కాల్పుల (Gunfire in South Africa) ఘటనలో 9 మంది మరణించారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవాళ్లలో ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు కాగా వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. నగరంలోని ఓ గోల్డ్ మైనింగ్ ఏరియాకు సమీపంలో ఉన్న టౌన్షిప్లో ఈ దుర్ఘటన జరిగింది. సౌతాఫ్రికా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెక్కెర్స్డాల్ ప్రాంతంలో ఆయుధాలు ధరించిన 12 మంది దుండగులు చొరబడ్డారు. అక్కడి స్థానిక వ్యాపార మాల్ సమీంలో ఉన్న జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. దుండగులు ఎవరు? ఏ కారణంతో కాల్పులు జరిపారనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. గత నెలలో ప్రిటోరియా జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ప్రపంచంలో అత్యధిక నేర, హత్యా రేటు ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి.


