కలం, యాదగిరిగుట్ట: ఓటరు జాబితాపై ప్రతిఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఆలేరు పరిధిలోని వంగపల్లిలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన (SIR)పై నియోజకవర్గ స్థాయి బూత్ ఏజెంట్ల అవగాహన సదస్సు జరిగింది.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) హాజరై బూత్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితా పరిశీలన ప్రక్రియలో బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, బండ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ క్యామ మల్లేష్, విద్యార్థి విభాగం నాయకుడు తుంగ బాలు, మాజీ జడ్పీటిసి తోటకూరి అనురాధ, రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కర్రే వెంకటయ్య, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు పాపట్ల నరహరి, ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణలో వర్సిటీల పరిస్థితి దారుణం : బండారు దత్తాత్రేయ
Follow Us On: Instagram

